ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 11, 2022, 5:40 PM IST

ETV Bharat / city

"ఇదో మాయల మరాఠీ బడ్జెట్.. ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదు''

AP PCC President on Budget: వైకాపా ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు తెచ్చి.. సంక్షేమాన్ని విస్మరిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ విమర్శించారు. కాగితాల ప్రకటనలకే బడ్జెట్ పరిమితమవుతోంది తప్ప.. ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదని ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అందుకు తగ్గ రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని మండిపడ్డారు.

AP PCC President on Budget
AP PCC President on Budget

AP PCC President on Budget: అప్పులు తెచ్చి.. అంకెల గారడీ బడ్జెట్​ను శాసనసభలో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ విమర్శించారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని కూడా.. సంక్షేమానికి ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రం చిన్నాభిన్నమవుతోందని అన్నారు. గత బడ్జెట్​లో దోచిందెంత.. దాచింది ఎంత? శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు తెచ్చి సంక్షేమాన్ని విస్మరిస్తూ తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కాగితాల ప్రకటనలకే బడ్జెట్ పరిమితమవుతోంది తప్పా... ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదని ఆరోపించారు. ఇదో మాయల మరాఠీ బడ్జెట్ అని విమర్శించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అందుకు తగ్గ రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని మండిపడ్డారు. న్యాయస్థానం తీర్పును సైతం ఈ ప్రభుత్వం విస్మరించి.. కోర్టు ధిక్కారణకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్​లో అమరావతి పేరు ప్రస్తావన కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలెవరికీ రుణాలివ్వలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:"ఆయన జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి"

ABOUT THE AUTHOR

...view details