రాష్ట్రంలో కరోనా మరణాలు 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. పాజిటివ్ కేసుల డబులింగ్ టైమ్ 30 రోజులుగా ఉందని వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి రేటు 1.09 గా ఉందన్న ఆయన.. ఎవరి ద్వారా వైరస్ సోకిందనే అంశాన్ని నిర్దారించగలుగుతున్నామని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.
'కరోనా మరణాలు 56శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే' - corona deaths in ap
రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.
మాస్కు కవచం అన్న ప్రచారం విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కలిపి 204 ఆస్పత్రుల్లో రోగులకు కొవిడ్ చికిత్స అందుతోందన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా అడ్మిషన్‌కు, టెస్టు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు ఎవరి సిఫార్సు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ల ఖాళీల వివరాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఆరు నెలలుగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నామన్న ఆయన.. 443 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలిపారు. 27 వేల మంది కొవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స పొందుతుండగా మిగతా వారు హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ కొవిడ్ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని దుర్వినియోగం చేయొద్దని ప్రైవేటు ఆస్పత్రులను హెచ్చరించారు. దీనిపై విజిలెన్స్ బృందాలను పంపుతామన్నారు.
ఇదీ చదవండి:ఇకపై రైతుల ఖాతాల్లోకే విద్యుత్ ఉచిత రాయితీ