ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం దుకాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం - మరో 13 శాతం మద్యం దుకాణాలు తగ్గింపు

మద్యం షాపులు తగ్గిస్తూ ఉత్తర్వులు
మద్యం షాపులు తగ్గిస్తూ ఉత్తర్వులు

By

Published : May 9, 2020, 3:25 PM IST

Updated : May 9, 2020, 7:05 PM IST

12:35 May 09

మద్యం షాపులు తగ్గిస్తూ ఉత్తర్వులు

మద్యం దుకాణాలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను మరో 13 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరుకు 2,934 దుకాణాలు మాత్రమే పనిచేస్తాయని.. మిగతా వాటిని మూసివేస్తున్నట్టు పేర్కొంది. మద్యపానాన్ని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలను నెలకొల్పటమే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపింది. అదనపు ఎక్సైజ్‌ రీటైల్ టాక్స్‌ పేరిట ధరలు పెంచినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది.

ప్రభుత్వం ఇప్పటికే 43 వేల బెల్టు దుకాణాలను తొలగించిన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వులకు అనుగుణంగా ఒక వ్యక్తికి బీర్లు, మద్యం విక్రయాలను 3 సీసాలకు మాత్రమే పరిమితం చేసినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూంలను కూడా తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే బార్ల సంఖ్యను 40 శాతం మేర కుదించి 530కి తగ్గించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
 

ఇదీ చదవండి :సారూ.. మీ కాళ్లు పట్టుకుంటా.. మాకు న్యాయం చెయ్యండి..!



 


 

Last Updated : May 9, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details