రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మరణించారు. కొత్త కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 5,92,760కి చేరింది. కొవిడ్ మహమ్మారి బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 5,105 మంది మృతి చెందారు. ప్రస్తుతం 90,279 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,97,376 మంది కోలుకున్నారని పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 75,013 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. ఈ పరీక్షలతో కలిపి మొత్తం 48,06,879 కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,421 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1,051, ప్రకాశం జిల్లాలో 873 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 798, అనంతపురం జిల్లాలో 725, గుంటూరు జిల్లాలో 685, నెల్లూరు జిల్లాలో 562, విజయనగరం జిల్లాలో 544, కడప జిల్లాలో 536 కొవిడ్ కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 495, కర్నూలు జిల్లాలో 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.