ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలులోనే హెచ్చార్సీ కార్యాలయం.. ప్రభుత్వం ఉత్తర్వులు - hc on aphrc news

హెచ్చార్సీ కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై హైకోర్టులో వాదనలు జరగ్గా.. మానవ హక్కుల కార్యాలయం ఎక్కడ పెట్టాలనే దానిపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

ap hrc in karnulu
ap hrc in karnulu

By

Published : Aug 27, 2021, 3:56 AM IST

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయం కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి నుంచి ఏపీ హెచ్ఆర్సీని కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 2017 అక్టోబర్ 24 తేదీన ఏపీహెచ్ఆర్సీని అమరావతిలో ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ.. నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక నుంచి ఏపీ హెచ్ఆర్సీ ప్రిన్సిపల్ సీట్ కర్నూలు నుంచి పనిచేస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందు ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మానవ హక్కుల కమిషన్​కు కర్నూలులో ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. హెచ్ఆర్సీ ఛైర్మన్, సభ్యులు కర్నూల్​లో రెండు ప్రాంగణాలను పరిశీలించగా అనుకూలంగా లేవని.. మరొకటి పరిశీలనలో ఉందన్నారు . ఇందుకు సంబంధించిన పురోగతిని తెలిపేందుకు విచారణను నెల రోజులకు వాయిదా వేయాలని కోరారు .హెచ్ఆర్సీ కర్నూల్‌లో ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా దూరంగా ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది పొత్తూరి సురేశ్ కుమార్ అభ్యంతరం తెలిపారు . తెలంగాణలో కాకుండా రాష్ట్ర పరిధిలో హెఆర్సీ ఏర్పాటు చేయాలని గతంలో స్పష్టం చేశామని ధర్మాసనం గుర్తు చేసింది . ఫలాన చోట ఏర్పాటు చేయాలని చెప్పలేమని.. ఎక్కడ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర విశేషాధికారం అని తెలిపింది. విచారణను నెల రోజులకు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది . ఏపీ లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు తాత్కాలికంగా హైదరాబాద్ నుంచే లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు పని చేస్తున్నాయి.

ఇదీ చదవండి:Covid Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 6.60 లక్షల కొవిడ్ టీకా డోసులు

ABOUT THE AUTHOR

...view details