ఉపాధి హామీ నిధుల చెల్లింపులకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరినాథ్ న్యాయస్థానాన్ని సమయం కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంది.
ఉపాధి నిధులపై హైకోర్టు విచారణ రెండు వారాలు వాయిదా - employee guarantee funds scheme news
ఉపాధి హామీ నిధులకు సంబంధించి విచారణ మరో రెండు వారాలకు వాయిదా పడింది. కేంద్ర తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ సమయం కోరినందున హైకోర్టు విచారణ వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.
ఉపాధి నిధులపై హైకోర్టు విచారణ రెండు వారాలకు వాయిదా
TAGGED:
ap highcourt news