ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో హెచ్​ఆర్సీ ఏర్పాటు పిటిషన్​పై హైకోర్టులో విచారణ... - ap high court on hrc in state

రాష్ట్రంలో ఏపీ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్​ఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.కేబినెట్ తీర్మానంతో నోటిఫికేషన్​ను మారుస్తున్నామన్నారు. ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన జీవో ప్రభుత్వం విడుదల చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ap high court trail on hrc in andhra pradesh
ap high court trail on hrc in andhra pradesh

By

Published : Aug 26, 2021, 7:06 PM IST

రాష్ట్రంలో ఏపీ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. 2017లో మానవ హక్కుల కమిషన్​ను అమరావతిలో ఏర్పాటు చేయాలని 2017లో నోటిఫికేషన్ ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. హెచ్​ఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కేబినెట్ తీర్మానంతో నోటిఫికేషన్​ను మారుస్తున్నామన్నారు. ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన జీవో ప్రభుత్వం విడుదల చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details