విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సుమోటోగా కేసు విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను ఈ నెల20కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం మరికొంత సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. ఇప్పటికే ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
విశాఖ గ్యాస్ లీకేజీ కేసు విచారణ వాయిదా - ఏపీ హైకోర్టు వార్తలు
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుమోటో కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరడంతో విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.
ap high court