ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 16, 2021, 10:43 PM IST

ETV Bharat / city

ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ప్రయాణాలపై వివరాలు సమర్పించండి: హైకోర్టు

కరోనా నేపథ్యంలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను 50 శాతం సీట్లు ఆక్యుపెన్సీతో నడపాలంటూ దాఖలైన వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

apsrtc
ap high court

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను 50 శాతం సీట్లు ఆక్యుపెన్సీతో నడపాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పూర్తి స్థాయి సీట్ల సామర్థ్యంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను నడుపుతున్నారని.. తద్వారా కరోనా వ్యాప్తి అధికమవుతుందని నెల్లూరు పట్టణానికి చెందిన న్యాయవాది జీపీఎస్ఎస్ శ్రీకాంత్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 50 శాతం సీట్లు ఆక్యుపెన్సీతో బస్సులను నడిపి ప్రయాణికులు కరోనా బారిన పడకుండా చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details