మానవ అక్రమ రవాణాను అడ్డుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మనుషుల అక్రమ రవాణా.. ముఖ్యంగా చిన్నపిల్లల రవాణా తీవ్రమైన వ్యవహారం అని స్పష్టంచేసింది. మానవ అక్రమ రవాణాను నిలువరించడంలో తగిన సలహాలు, సూచనలు చేసేందుకు, కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను అమికస్ క్యూరీ కోర్టుకు సహాయకారిగా నియమించింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిన్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
అక్రమ రవాణాను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది: హైకోర్టు - మానవ అక్రమ రవాణాపై హైకోర్టు కామెంట్స్
మనుషుల అక్రమ రవాణా.. ముఖ్యంగా చిన్నపిల్లల రవాణా తీవ్రమైన వ్యవహారం అని హైకోర్టు పేర్కొంది. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. చిన్నారులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనంపై కోర్టు విచారణ జరిపింది.
చిన్నారులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనంపై పత్రికల్లో వచ్చిన రెండు కథనాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సుమోటో ప్రజాహిత వ్యాజ్యాలుగా మలిచి విచారణ జరుపుతుంది. తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని గండాలయపేటకు శిశువు విక్రయం వ్యవహారంలో 11 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారికి బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించిందన్నారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి గతేడాదిలో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యాలను ప్రస్తుత వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని న్యాయస్థానం ఆదేశించింది. అమికస్ క్యూరీగా సి.శ్రీరఘురాంను నియమించింది. దస్త్రాలను అమికస్ క్యూరీకి అందజేయాలని ప్రభుత్వ న్యాయవాదని ఆదేశించింది.
ఇదీ చదవండి:జగన్ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, ప్రాణాలకు రక్షణ లేదు: చంద్రబాబు