రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మద్యం కొనుగోలుదారులు భౌతికదూరం పాటించట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీనివల్ల కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ నిబంధనలు అనుసరించే వైన్ షాపులకు అనుమతిచ్చామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే ఇదే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
మద్యం అమ్మకాలపై హైకోర్టులో విచారణ వాయిదా - ఏపీ హైకోర్టు వార్తలు
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై విచారణ చేపట్టిన హైకోర్టు...తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ap high court