HC On Mahila Karyadarshi: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో మహిళా పోలీసులుగా పరిగణిస్తూ... గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 59 స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వివేకానంద హైకోర్టుకు నివేదించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వ్యాజ్యాలను ఉపసంహరించుకొని.. తాజాగా ఇచ్చిన జీవోను సవాలు చేయడానికి పిటిషనర్లకు స్వేచ్ఛనిచ్చింది.
మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడంపై హైకోర్టులో విచారణ... - AP news
HC On Mahila Karyadarshi: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళ సంరక్షణ కార్యదర్శులపై హైకోర్టులో విచారణ జరిగింది. వారిని పోలీసులుగా పరిగణిస్తూ.. గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
HC On Mahila Karyadarshi
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిన్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాననం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మహిళ సంరక్షణ కార్యదర్శులను ' మహిళ పోలీసులు' గా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 59ని నవాలు చేస్తూ హైకోర్టులో గతంలో మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఇదీ చదవండి:'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదు: విజయవాడ సీపీ