కరోనా సమయంలో దీపావళి పండగ నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం నియంత్రణ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచనలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. టపాసుల విక్రయాలపై కూడా నిషేధాజ్ఞలు జారీ చేశారు. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీపావళి సామగ్రి విక్రయించే దుకాణాల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది.