రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ లేఖ రాసిన ప్రభుత్వం ఇప్పుడు ఓ ప్రత్యేక అధికారిని దిల్లీకి పంపింది. సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ దిల్లీలో పర్యటించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అధిగమించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను కోరారు.
తమిళనాడులోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు నేరుగా కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేంద్రానికి ఏపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రానికి కావాల్సిన నిల్వలను అందించేందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఙప్తి చేసింది. ఈమేరకు బొగ్గు, రైల్వే, విద్యుత్ శాఖలతో ఏపీ ఉన్నతాధికారులు ఇవాళ కూడా భేటీ కానున్నారు.
ఒడిశా విద్యుతుత్పత్తి సంస్థ వద్దనున్న మిగులు బొగ్గు నిల్వలను కొనుగోలు చేసేందుకు ఏపీజెన్‌కో ప్రయత్నిస్తోంది. ఒడిశాలోని జిందాల్ సంస్థకు సదరు నిల్వలను బదిలీ చేయడం ద్వారా 25 శాతం విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసే అంశాన్ని ప్రయత్నిస్తోంది. మరోవైపు సింగరేణి నుంచి ఏడు రోజుల పాటు... రోజుకు 8 రేక్‌ల బొగ్గు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీర్చడానికి ప్రభుత్వం చర్యలు - బొగ్గు కొరత
థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సీఎంవోకు చెందిన ప్రత్యేక అధికారి దిల్లీలో బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను కలుసుకుని పరిస్థితిని వివరించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీర్చడానికి ప్రభుత్వం చర్యలు