ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెట్రోలు, డీజిల్​పై 1 శాతం సెస్ విధించేందుకు ప్రభుత్వం సమాయత్తం..! - పెట్రో ఉత్పత్తులపై సెస్ పెంపు వార్తలు

రాష్ట్రంలో పెట్రో ఉత్పత్తులపై మళ్లీ సెస్ వేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. పెట్రోలు, డీజిల్​పై లీటరుకు రూపాయి చొప్పున సెస్ విధించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సెస్ పెంపునకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్​పై 1 శాతం సెస్ విధింపు..!
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్​పై 1 శాతం సెస్ విధింపు..!

By

Published : Sep 17, 2020, 10:02 PM IST

ఆంధ్రప్రదేశ్​లో మరో రూపాయి చొప్పున పెట్రోలు, డీజిల్​పై సెస్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీనికి సంబంధించి వాణిజ్య పన్నులశాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సెస్ పెంపు ప్రతిపాదనపై ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలోనూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెట్రోలు, డీజిల్ లీటరుపై రూపాయి చొప్పున సెస్ విధించాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అదనంగా లీటరుపై రూపాయి చొప్పున సెస్ విధించటం ద్వారా రూ.600 కోట్లు మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సెస్ ఆదాయం రహదారుల కోసం

సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రహదారుల నిర్మాణం కోసం వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ముడి చమురుపై రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం మేర వ్యాట్ విధిస్తోంది. పెట్రోల్​పై 31 శాతం మేర వ్యాట్​ను, అదనంగా 4 రూపాయల మేర అదనపు పన్నును వసూలు చేస్తున్నారు. అటు డీజిల్ పై 22.5 శాతం మేర వ్యాట్​తో పాటు అదనంగా 4 రూపాయల పన్నును వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తోంది. ప్రస్తుతం కొవిడ్ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన వేర్వేరు ఆదాయాలు కోల్పోవటంతో అదనంగా ఆదాయాన్ని రాబట్టేందుకు పెట్రోలు డీజిల్​పై లీటరుకు ఒక్క రూపాయి చొప్పున వేర్వేరుగా సెస్​ను విధించాలని నిర్ణయించారు.

త్వరలో ఉత్తర్వులు

వాస్తవానికి పెట్రోలు, డీజిల్​పై ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్​తో పాటు అదనపు పన్నులతో 4480 కోట్ల రూపాయల మేర ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలకు కేవలం రూ.1323 కోట్లు మాత్రమే పన్నులు వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇటీవలే సహజవాయువు పైనా వ్యాట్​ను 24.5 శాతం మేర వసూలు చేయాలని నిర్ణయించింది. మరింత ఆదాయం కోసం పెట్రోలు, డీజిల్ పైనా 1 శాతం మేర సెస్​ను విధించనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఇదీ చదవండి :ఉండిలో అవినీతి పెరిగిపోయింది... వైకాపా నేత తిరుగుబాటు దీక్ష

ABOUT THE AUTHOR

...view details