తుంగభద్ర నదీ పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం విడతల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా పుష్కరాల బందోబస్తు కోసం తాజా నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పుష్కర ఘాట్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసేందుకు 5 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. మొత్తం 21 ఘాట్ లలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్ల కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ నెల 20 తేదీ నుంచి డిసెంబరు 1 తేదీ వరకూ జరుగనున్న తుంగభద్ర నదీ పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
తుంగభద్ర పుష్కరాల కోసం రూ.5 కోట్లు విడుదల - తుంగభద్ర నదీ పుష్కరాల కోసం నిధుల విడుదల
తుంగభద్ర నదీ పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కోట్లను విడుదల చేసింది. మొత్తం 21 ఘాట్లలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్ల కోసం ఈ నిధులను వెచ్చించచున్నారు.
tungabhadra pushkaralu
ఇదీ చదవండి