ఇప్పటివరకు వాహనాల డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా అంతగా పట్టించుకోని రవాణాశాఖ.. ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించేందుకు సన్నద్ధమైంది. తనిఖీలు ముమ్మరం చేయాలని.. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు వేయాలంటూ క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తనిఖీలు నిర్వహించి, జరిమానాల ద్వారా రూ.352 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రూ.70 కోట్ల వరకు వసూళ్లయ్యాయి. తనిఖీలు పెంచి మార్చిలోగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలని నిర్ణయించింది.
మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా.. పోలీసులకు దొరికితే అంతే..! - traffic police
డ్రైవింగ్ లైసెన్స్, వాహనం పత్రాలు లేకుండా రోడ్డు మీదకు వస్తే.. మీ సంగతి అంతే.. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు.
ap government driving licence