ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"బిల్డ్​ ఏపీ" పేరుతో మరో కొత్త పథకం - andhra pradesh government

రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి బిల్డ్​ ఏపీ పేరుతో కొత్త మిషన్​ను మొదలుపెట్టింది.

ap logo

By

Published : Oct 30, 2019, 12:03 AM IST

రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ‘బిల్డ్‌ ఏపీ’ పేరుతో కొత్త మిషన్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఎన్‌బీసీసీ సంస్థతో కలిసి ‘బిల్డ్‌ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములు గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది. మిగతా భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలు సేకరించనుంది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని సంయుక్త పాలనాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. ఈ అంశంపై బుధవారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details