11వ పీఆర్సీ నివేదికను.. విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం - asthutosh mishra report
22:18 March 05
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక విడుదల
ప్రభుత్వం ఎట్టకేలకు పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను విడుదల చేసింది. చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది. పూర్తి ప్రతిని ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
ఫిట్‌మెంట్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులతో చర్చల సందర్భంగా పీఆర్సీ నివేదికను విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మేరకు శనివారం రోజు విడుదల చేశారు.
ఇదీ చదవండి:Botsa: ముమ్మాటికీ వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స