ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత, టీకా కార్యక్రమం కొనసాగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈనెల 11న ఉత్తర్వులు జారీచేసింది. దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీలు చేయగా సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఏకసభ్య ధర్మాసనం తీర్పును కొట్టేసి, ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ గురువారం 37 పేజీల తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని అప్పీలు - sec on panchayath elections in ap
17:42 January 21
.
దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 5.09 గంటలకు ఆన్‌లైన్ ద్వారా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డెయిరీ నంబరు (1796) కేటాయించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం అప్పీలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కేవియట్ దాఖలు చేసింది. అప్పీలును విచారణ చేసేటప్పుడు తమ వాదనలూ వినాలని కోరింది. తమ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.
ఇవీ చదవండి:
స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై.. తుది నిర్ణయం ఎస్‌ఈసీదే: హైకోర్టు