AP OBJECTION ON TS POWER GENERATION : శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉత్పాదన కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ నీటి వినియోగాన్ని నిలువరించాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈమేరకు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 195 టీఎంసీల నీటి నిల్వ ఉందని.. విద్యుత్ ఉత్పత్తి కారణంగా నీరు వృథాగా పోతోందని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ
LETTER TO KRMB CHAIRMAN : శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడంపై.. రాష్ట్రం మరోమారు అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉత్పాదన కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణా నీటి వినియోగాన్ని నిలువరించాలంటూ.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది.
ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటి మట్టాలు ఉన్నాయని స్పష్టం చేసింది. తెలంగాణ జలవిద్యుత్ ఉత్పాదన కారణంగా నీరు వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తోందని లేఖలో పేర్కొంది. విద్యుత్ ఉత్పాదన కోసం ఇప్పుడే నీటిని వినియోగిస్తే సీజన్ ముగిసే సమయానికి సాగు, తాగునీటి ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేసింది. తక్షణం తెలంగాణా జెన్కో విద్యుత్ ఉత్పాదన కోసం నీటి వినియోగాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లేఖ రాసింది.
ఇవీ చదవండి: