ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి - free sand policy in andhra

ఇప్పటివరకూ ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చని అనుమతిచ్చిన ప్రభుత్వం.. ఇక నుంచి ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

sand tractors
స్థానిక వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి

By

Published : Jun 26, 2020, 4:34 AM IST

ఇసుక విధానంపై విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. నదులు, వాగులు, ఇతర జలవనరుల వెంట ఉండే గ్రామాల్లో వ్యక్తిగత అవసరాలకు ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చని అనుమతిచ్చిన ప్రభుత్వం...ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా తీసుకు వెళ్లేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు.. ఉత్తర్వులు జారీ చేసింది. బలహీన వర్గాలకు ప్రభుత్వం నిర్మించే ఇళ్ల కోసం ఉచితంగానే ఇసుక తీసుకు వెళ్లేందుకు అనుమతులు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పునరావాసం కింద ప్రభుత్వం నిర్మించే గృహాలకూ ఇసుక సరఫరా ఉచితమేనని ఆదేశాలిచ్చింది. ఇందుకోసం ఏపీ వాల్టా చట్టంలో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇవీ చూడండి-జూలై 1న నూతన 104, 108 వాహన సేవలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details