ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదో తరగతి ప్రశ్నాపత్రాల రవాణాకు ఉత్తర్వులు జారీ - ఏపీ పదో తరగతి పరీక్షలు

ఈ నెల 31 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రభుత్వం ప్రశ్నాపత్రాలను అత్యవసర సేవల విభాగంలోకి చేర్చింది. జిల్లాలకు ప్రశ్నాపత్రాల రవాణాకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ap government allowed
జిల్లాలకు పదో తరగతి ప్రశ్నాపత్రాల రవాణా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ

By

Published : Mar 23, 2020, 10:04 PM IST

జిల్లాలకు పదో తరగతి ప్రశ్నాపత్రాల రవాణా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ

ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ప్రశ్నాపత్రాల రవాణాకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశ్నాపత్రాలను అత్యవసర సేవల విభాగంలోకి చేర్చింది. విజయవాడ, గన్నవరం, కర్నూల్లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి ప్రశ్న, జవాబు పత్రాల బుక్‌లెట్లు, ఓఎమ్మార్ షీట్ల రవాణాకు పాఠశాల విద్యాశాఖ అనుమతినిచ్చింది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా విద్యార్థులకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష కేంద్రాల్లో అమర్చబోయే వెబ్‌కామ్‌ల రవాణాకూ వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చూడండి-రాజధాని భూముల కేసు సీబీఐకి అప్పగింత

ABOUT THE AUTHOR

...view details