ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SOLAR POWER: సౌర విద్యుత్ కొనుగోలుకు.. ఏపీ ఈఆర్‌సీ అనుమతి - ఏపీ 2021 వార్తలు

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 7 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోళ్లకు AP డిస్కంలకు ఈ.ఆర్​.సీ అనుమతిచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్ల పాటు ఏడాదికి 15 వేల మిలియన్ యూనిట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

ap-erc-approval-for-purchase-of-solar-power
సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ ఈఆర్‌సీ అనుమతి

By

Published : Nov 13, 2021, 2:14 PM IST

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ ఈఆర్‌సీ అనుమతిచ్చింది. 7 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోళ్లకు ఏపీ డిస్కంలకు ఈ.ఆర్​.సీ పర్మిషన్ ఇచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్లపాటు ఏడాదికి 15 వేల మిలియన్ యూనిట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

సెప్టెంబర్ 2024 నాటికి 3 వేల మెగావాట్లు, సెప్టెంబర్ 2025 నాటికి మరో 3 వేల మెగావాట్లు, సెప్టెంబర్ 2026 నాటికి 1000 మెగావాట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేసేందుకు ఈఆర్సీ సమ్మతించింది. సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో త్రైపాక్షిక ఒప్పందానికి ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. వీలింగ్ ఛార్జీలు, నెట్‌వర్క్‌ ఛార్జీలు ప్రభుత్వం నుంచి క్లయిమ్ చేసుకోవాల్సిందిగా ఏపీ ఈఆర్‌సీ సూచించింది.

ఇదీ చూడండి:KALAMANANDABHARATHI SWAMY: శ్రీ భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా శ్రీ శ్రీశ్రీ కామలానందభారతీ స్వామి

ABOUT THE AUTHOR

...view details