రాష్ట్రంలో కొత్తగా 139కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మహమ్మరి బాధితుల సంఖ్య 8,86,557కు చేరింది. వైరస్ ధాటికి ఇప్పటివరకు మొత్తం 7,142 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఎటువంటి మరణం సంభవించలేదని బులెటెన్‌లో పేర్కొన్నారు. తాజాగా 254 మంది బాధితులు వ్యాధినుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 8.77లక్షల మంది ఆసుపత్రుల నుంచి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 49,483 మందికి పరీక్షలు జరిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 27 లక్షలు దాటాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 139 కరోనా కేసులు నమోదు - corona news
రాష్ట్రంలో కొత్తగా 139 మంది వైరస్ బారిన పడగా మొత్తం బాధితుల సంఖ్య 8,86,557కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 8.77లక్షల మంది మహమ్మారిని జయించారు. మరోవైపు కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 27 లక్షలు దాటాయి.
కరోనా కేసులు నమోదు