ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా విలయతాండవం... కొత్తగా 60 కేసులు - ap corona latest health bulletin

రాష్ట్రంలో కొత్తగా  60 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు

By

Published : May 1, 2020, 11:43 AM IST

Updated : May 2, 2020, 6:51 AM IST

11:34 May 01

కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

రాష్ట్రంలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. సరకు రవాణా ద్వారా వైరస్‌ ఒకచోటి నుంచి మరోచోటికి వైరస్‌ వ్యాపించడం ఆందోళన కలిగిస్తుంది. అటు కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఆశాజనకంగానే ఉందని అధికారులు వెల్లడించారు.

కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 60 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే 44 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1463కి పెరిగింది. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజాగా 7వేల 902 పరీక్షలు చేయగా ఇప్పటివరకూ చేసిన కొవిడ్‌ పరీక్షల సంఖ్య లక్షా 2వేల 460కి చేరింది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆశలు రేపుతోంది. కొత్తగా 82 మంది కోలుకొని ఇళ్లకు చేరుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 403కి పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది నాలుగో వంతు కన్నా ఎక్కువ అంటే.. 27.5 శాతం కావడం విశేషం. మొత్తం కేసుల్లో 65.8 శాతం కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే 28శాతం ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 306 కేసులు నమోదు కాగా... గుంటూరు నగరంలో 146, నర్సరావుపేట పట్టణంలో 121 నమోదయ్యాయి. గుంటూరు నగరం పరిధిలో తీవ్రత క్రమంగా తగ్గుతుండగా.... నర్సరావుపేటలో పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో సంపూర్ణ లాక్ డౌన్ మరో 3 రోజుల పొడిగింపు, కంటైన్మెంట్ జోన్లలో పకడ్బందీ నిర్బంధం లాంటి చర్యలు పోలీసులు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారి ద్వారా కొందరికి వైరస్ సోకినట్లు గుర్తించినందున.... సీసీ కెమెరాల నిఘా సైతం ఏర్పాటు చేశారు. కెమెరాలు లేని చోట్ల కొత్తవి ఏర్పాటు చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. జిల్లాలో మరో 50 మంది కోలుకొంటున్నారన్న కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌..త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్లు చెప్పారు. నరసరావుపేటలో నిత్యావసరాలను ఇళ్లకే పంపుతామన్న ఆర్డీవో... ఉల్లంఘించిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు.

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంపై కలెక్టర్ వీరపాండియన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ కట్టడికి కర్ఫ్యూ విధించనున్నట్లు చెప్పారు. విజయవాడ నుంచి సరకు రవాణా వాహనాల కారణంగానే కృష్ణా జిల్లా నూజివీడులో కరోనా విజృంభిస్తోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఓ వ్యాన్‌ డ్రైవర్‌కు తాజాగా వైరస్‌ సోకడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మేరకు విజయవాడ నుంచి కూరగాయలు, సరుకులు దిగుమతిని నిషేధించినట్లు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పారు. నూజివీడు పట్టణాన్ని శనివారం కూడా సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగిరిపల్లి మండలంలో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, విజయవాడ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని శానిటైజ్ చేయనున్నట్లు చెప్పారు.

ఇతర జిల్లాల్లో

కడప జిల్లాలో మరో 6 కేసులు నమోదయ్యాయి. బీకేఎం వీధిలో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురికి వైరస్‌ సోకింది. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్లలో మిగిలిన ఇద్దరు బాధితులను గుర్తించారు. అనంతపురం జిల్లా 6, పశ్చిమ గోదావరి 2, విశాఖ 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


ఇదీ చదవండి :  గుజరాత్​ నుంచి స్వస్థలాలకు మత్స్యకారులు



 

Last Updated : May 2, 2020, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details