ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తగ్గిన ఉద్ధృతి...కొత్తగా 6,235 కరోనా కేసులు - ఏపీ కరనా కేసులు

కరోనా కేసులు
కరోనా కేసులు

By

Published : Sep 21, 2020, 5:10 PM IST

Updated : Sep 21, 2020, 9:09 PM IST

17:08 September 21

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మెల్లగా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 6 వేల 235 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధరించారు. కొవిడ్ కాటుకు మరో 51 మంది కన్నుమూయగా.. మొత్తం మరణాల సంఖ్య 5 వేల 410కి చేరింది. అన్ని జిల్లాల్లోనూ కేసుల సంఖ్య తగ్గుతున్నా.... తూర్పు గోదావరిలో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.

కరోనా బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 56వేల569 నిర్ధరణ పరీక్షలు చేయగా... 6 వేల 235 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 6 లక్షల 31 వేల 749కి చేరింది. వైరస్‌ కాటుకు మరో 51 మంది బలయ్యారు. కృష్ణాలో 9... చిత్తూరు జిల్లాలో 7... విశాఖలో ఆరుగురు... అనంతపురంలో 5... గుంటూరు, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో నలుగురేసి... కర్నూలులో ముగ్గురు... కడప, ప్రకాశంలో ఇద్దరేసి... శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు తుదిశ్వాస విడిచారు. మొత్తం మరణాల సంఖ్య 5వేల 410కి చేరింది. వైరస్‌ బారి నుంచి కొత్తగా 10వేల 502 మంది కోలుకోగా.. ప్రస్తుతం 74వేల 518 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 51లక్షల 60వేల 700 నిర్ధరణ పరీక్షలు చేపట్టారు.

జిల్లాల్లో కేసులు

కనీసం వెయ్యి రోజువారీ కేసులైనా నమోదవడం ఆనవాయితీగా మారిన తూర్పుగోదావరిలో మరోసారి ఆ మార్క్ దాటింది. కొత్తగా 1262 మందికి వైరస్‌ నిర్ధరించారు. పశ్చిమలో 962.... ప్రకాశంలో 841.... గుంటూరు జిల్లాలో 532... అనంతపురంలో 505.... నెల్లూరు జిల్లాలో 401 మందికి కరోనా పాజిటివ్‌గా తేల్చారు. విజయనగరం జిల్లాలో 395.... చిత్తూరులో 362.... శ్రీకాకుళంలో 283... కడపలో 219.... కర్నూలులో 190.... విశాఖలో 150.... కృష్ణా జిల్లాలో 133 కొత్త కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. 

రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి సంబంధించిన పాజిటివిటీ రేటు 12. 24 శాతంగా ఉందని వైద్యారోగ్యశాఖ బులెటిన్​లో పేర్కోంది. రికవరీల రేటు కూడా గణనీయంగా నమోదు అవుతోందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : 'తిరుమల కొండపైనే మద్యం అమ్మేలా ఉన్నారు!'


 


 

Last Updated : Sep 21, 2020, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details