corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,010 కరోనా కేసులు, 13 మరణాలు
16:32 September 30
vJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58,054 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,010 మంది కొవిడ్ బారిన పడ్డారు. 13 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1,149 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
కరోనాతో చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో 244, చిత్తూరు జిల్లాలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:Corona: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం... నలుగురు ఉపాధ్యాయులకు వైరస్