ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 15, 2020, 6:51 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 500 కరోనా కేసులు..ఐదుగురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 500 మందికి కొవిడ్ నిర్ధారణ జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 563 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. ఐదుగురు మహమ్మారికి బలయ్యారని పేర్కొంది. తాజా కేసులతో కలిపి.. ఏపీలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 8,76,336కి చేరిందని ప్రకటించింది.

ap covid bulletin
ఏపీ కొవిడ్ బులెటిన్

గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,452 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 500 మందికి వైరస్ సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 563 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. కృష్ణాలో ఇద్దరు.. చిత్తూరు, గుంటూరు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని వెల్లడించింది. చిత్తూరులో అత్యధికంగా 88 మంది, కర్నూలులో అత్యల్పంగా 9 మందికి కరోనా నిర్ధారణ జరిగిందని తెలిపింది. కృష్ణాలో 77, పశ్చిమగోదావరిలో 63, గుంటూరులో 55, తూర్పుగోదావరిలో 47, కడపలో 34, ప్రకాశంలో 26, నెల్లూరులో 22, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 20, విజయనగరం, అనంతపురంలో 19 చొప్పున కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక కోటి 9లక్షల 37వేల 377 నమూనాలను పరీక్షించగా.. మొత్తం 8,76,336 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 8,64,612 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మరో 4,660 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి ధాటికి 7,064 మంది మరణించారు.

ఏపీ కొవిడ్ బులెటిన్

ABOUT THE AUTHOR

...view details