ప్లవ నామ సంవత్సరంలో ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో కళకళలాడాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. క్యాంపు కార్యాలయంలో..రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని.. కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు.
మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్ పంచాగ శ్రవణాన్ని ఆలకించారు. ప్లవ నామ సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళికలు, ఆర్థిక వృద్ధి ఉంటుందని పంచాంగ శ్రవణకర్త సుబ్బరామ సోమయాజులు తెలిపారు. సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ ఫలితాలు బాగున్నాయన్నారు. గురుడు, వరుణుడి అనుగ్రహం కారణంగా వర్షాలు పడి వ్యవసాయం బాగుంటుందని పంచాంగ శ్రవణంలో వెల్లడించారు.