ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాకులో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 30వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ కావడం వల్ల ఎన్నిరోజుల పాటు సమావేశాలు నిర్వహించాలన్న అంశంతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై మంత్రి వర్గం చర్చించనుంది. మరోవైపు దిశ బిల్లులో సవరణలు, నివర్ తుపాను ప్రభావంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ఇవాళ మంత్రివర్గ సమావేశం... సభలో పెట్టే బిల్లులపై చర్చ - ఏపీ కేబినేట్ భేటీ న్యూస్
ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ కానుంది. ఈనెల 30వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు, నివర్ తుపాను ప్రభావంపై సమావేశంలో చర్చించనున్నారు.
Ap Cabinet meet
Last Updated : Nov 27, 2020, 10:48 AM IST