రామాయపట్నం పోర్టు నిర్మాణ అడ్డంకులు తొలగించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్నినాని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు పరిధిని కుదిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పీపీపీ విధానంలో భోగాపురం విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. జీఎంఆర్‌కు ఇచ్చిన 2,703 ఎకరాలను 2,200 ఎకరాలకు కుదిస్తున్నట్లు తెలిపారు. మిగతా 500 ఎకరాలు ప్రభుత్వ అధీనంలో ఉంచుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
పీపీపీ విధానంలో భోగాపురం విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు - ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ఏరువాకలో భాగంగా రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. సీడ్ కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు తెచ్చుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలు వెల్లడిస్తున్న పేర్ని నాని
'ఏరువాకలో భాగంగా రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నాం. సీడ్ కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు తెచ్చుకునేందుకు ఆమోదం తెలిపాం. కర్నూలు జిల్లాలో 4 గ్రామ సచివాలాయల ఏర్పాటు కోసం 44 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది' - పేర్ని నాని
ఇదీ చదవండి : ఇళ్ల స్థలాల పంపిణీకి మంత్రివర్గం ఆమోదం