ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో భాజపా హౌస్ మోషన్ పిటిషన్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
13:03 April 02
హైకోర్టులో భాజపా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ... భాజపా, మరికొందరు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పిటిషన్లలో కోరారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి
Last Updated : Apr 2, 2021, 3:57 PM IST