రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ఈసీ ఆదేశించినట్లుఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు వివరించారు. మే 27 వరకు పోలీసు అధికారులంతా ఈసీ పరిధిలోనే ఉంటారని కోర్టుకు ఏజీ తెలిపారు. దీనిపై వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... ఎన్నికల విధుల్లో డీజీ లేరన్న సంబంధిత పత్రాలను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
'ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ'.. రేపటికి వాయిదా! - intelligence dg
ఎన్నికల వేళ ఏపీలో ఐపీఎస్‌ల బదిలీని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఏజీ వాదనలు వినిపించారు.
డీజీ స్థానచలనంపై హైకోర్టులో వాదనలు
కేసు విచారణలో తమను చేర్చాలంటూ న్యాయస్థానాన్ని వైకాపా కోరింది. ఇంప్లీడ్ పిటిషన్ వేస్తామని తెలియజేసింది. కోర్టు మాత్రం వైకాపా వాదనలను తర్వాత వింటామని చెప్పి... తదుపరి వాదనలను రేపటికి వాయిదా వేసింది.
Last Updated : Mar 27, 2019, 5:14 PM IST