ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 15 లేదా 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు..! - ap assembly meetings news

ఈ నెల 15 లేదా 16 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో సమావేశాలను సాధ్యమైనంత తక్కువ రోజులకు కుదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్​ సమావేశాల నిర్వహణపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని అసెంబ్లీ కార్యదర్శి చెబుతున్నారు.

ఈ నెల 15 లేదా 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు..?
ఈ నెల 15 లేదా 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు..?

By

Published : Jun 7, 2020, 4:35 PM IST

Updated : Jun 7, 2020, 6:07 PM IST

శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓటాన్ అకౌంట్ కోసం తెచ్చిన ఆర్డినెన్స్ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనున్న క్రమంలో ఈ నెల 15 లేదా 16 నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈనెల 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉంది. కరోనా కారణంగా బడ్జెట్​ సమావేశాలను సాధ్యమైనంత తక్కువ రోజులకు కుదించే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణంలో ఒకరికి.. సచివాలయంలోనూ పలువురు ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ క్రమంలో పరిమిత రోజుల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ సమావేశాలు నడపాలని నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల నిర్వాహణపై తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వం సమాచారం పంపనున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Jun 7, 2020, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details