MEKAPATI DEATH : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిని నోటిఫై చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు 115వ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌతమ్ రెడ్డి, ఫిబ్రవరి 21వ తేదీన మృతి చెందారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆ శాసన సభ స్థానం ఖాళీ అయినట్టుగా పేర్కొంటూ ఏపీ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ ఇచ్చారు.
AP ASSEMBLY : మేకపాటి మృతిని నోటిఫై చేసిన శాసనసభ - MEKAPATI DEATH
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిని శాసనసభ నోటిఫై చేసింది. మంత్రి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్య క్రియలు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.
మేకపాటి మృతిని నోటిఫై చేసిన శాసనసభ