Bopparaju on Outsourcing Employees: ప్రభుత్వ మెప్పు కోసం అధికారులు ఇచ్చిన పీఆర్సీ నివేదిక ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఏపీ అమరావతి ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఏపీ కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విజయవాడ ఐకాస సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
AP Outsourcing Employees problems: ‘ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో లక్ష మంది వరకు ఆప్కోస్ కిందకు రాలేదు. ఉద్యోగులు ఏజెన్సీల దోపిడీకి గురవుతున్నారు. వీరికి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ వంటివి అమలు కావడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. ఒకరికి ఇచ్చే జీతంతో ఇద్దరిని నియమించుకుని పని చేయించుకుంటున్నారు. కొందరు అధికారులు వారి సొంత పనులు చేయడం లేదని సిబ్బందిని తీసేస్తున్నారు' అని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఉద్యోగుల ఐకాస నాయకులు స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.