- రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
లూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంబేడ్కర్ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన సీఎం జగన్
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం జగన్ సహా పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. రాజ్యాంగానికి ప్రతిరూపం, అణగారిన వర్గాల ఆశాదీపం అంబేడ్కర్ అని సీఎం జగన్ కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు..!
ఆర్టీసీ ఛార్జీల మోతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కదం తొక్కింది. ఇప్పటికే రకరకాల బాదుడుతో జనాన్ని పీడిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు బస్సు ఛార్జీలు పెంచడం అత్యంత దారుణమంటూ నేతలు మండిపడ్డారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఈనెల 15న జరగనున్న శ్రీ కోదండ రామస్వామి కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ వెల్లడి
రాష్ట్రంలో ఇవాళ, రేపు స్వల్పంగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. వర్షపాతం అంచనాలను విడుదల చేసిన ఐఎండీ.. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించిన మోదీ
ప్రధాన మంత్రుల మ్యూజియంను(ప్రధాన్‌మంత్రి సంగ్రహాలయ) ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్య్రానంతరం.. భారత్‌కు సేవలందించిన ప్రతి ప్రధాని జీవిత విశేషాలను వివరించేలా, వారికి నివాళిగా ఈ మ్యూజియం ఏర్పాటైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉక్రెయిన్‌కు భారీ మిలిటరీ ప్యాకేజ్.. ప్రకటించిన బైడెన్
ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు కొత్తగా 800 మిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆమోదించారు. ఈ ప్యాకేజీలో ఉక్రెయిన్‌కు అవసరమైన అత్యంత ప్రభావంతమైన సాయుధ వ్యవస్థలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ట్విట్టర్ మొత్తాన్ని కొనేస్తా'.. మస్క్ ఆఫర్.. అగర్వాల్ ఏం చేసేనో?
దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లోని షేర్లు అన్నింటినీ కొనేసి, ఆ సంస్థను తన సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ట్విట్టర్‌కు ఆఫర్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. - భారత్-పాక్ స్టార్ ఆటగాళ్లు.. ఒకే జట్టు తరఫున బరిలో..
టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల స్టార్ క్రికెటర్లు ఒకే జట్టుకు ఆడుతున్నారు. అది ఇంగ్లాండ్ కౌంటీల్లో. గురువారమే ససెక్స్ జట్టు తరఫున అరంగేట్రం చేశారు ఛతేశ్వర్ పుజారా, మహ్మద్ రిజ్వాన్. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కేజీఎఫ్'కి దీటుగా 'కేజీఎఫ్ 2'.. ఇక బాక్సాఫీస్ బద్దలే!
భారీ అంచనాలతో నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2'. ఈ మూవీని చూసేందుకు అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.