తెలంగాణ సచివాలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతోంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరొకరికి కరోనా సోకింది. ఐటీ శాఖలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందిలో ఓ మహిళా ఉద్యోగికి వైరస్ నిర్ధరణ అయింది. గత ఐదు రోజులుగా సదరు ఉద్యోగి విధులకు హాజరు కావడం లేదు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయిస్తే పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో బీఆర్కే భవన్‌లో ఐటీ విభాగం ఉన్న రెండో అంతస్తులో కలవరం మొదలైంది.
తెలంగాణ: సచివాలయ ఉద్యోగులను కలవరపెడుతున్న కరోనా - telangana secretariat employee corona
తెలంగాణలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. తాజాగా సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరొకరికి కరోనా సోకింది.
తెలంగాణ సచివాలయ ఉద్యోగులను కలవరపెడుతున్న కరోనా
ఇప్పటికే ఆర్థిక శాఖలో ఇద్దరికి కరోనా సోకడంతో ఆ శాఖలోని ఉద్యోగులు ఎవరూ విధుల్లోకి రావడం లేదు. బీఆర్కే భవన్లోకి సందర్శకులను కూడా అనుమతించడం లేదు. అత్యవసర పనులపై వచ్చే వారైతే సంబంధిత అధికారుల అనుమతితోనే లోపలికి పంపిస్తున్నారు. అధికారులు కూడా వీలైనంత మేరకు ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు.