మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు . కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. పటమట పోలీస్ స్టేషన్ ఎస్సై కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో తెలిపారు . 188, 269, 270 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లు, ఎపిడమిక్ యాక్ట్ కింద నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Dhulipalla Narendra: తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు - తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర వార్తలు
police case on dhulipalla
14:52 June 06
ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు
గత నెల 29న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నోవాటెల్ హోటల్లో 20 మందితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారని వివరించారు. కరోనా వేళ నిబంధనలు పాటించలేదన్నారు . సమావేశానికి హాజరైన అందరూ హోటల్ లోని లాబీలో కూర్చుని భోజనం చేశారని ..అనంతరం సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో తెలిపారు . 601,602 రూమ్ లను సంగం డెయిరీ పేరుపై రిజర్వ్ చేశారని ప్రస్తావించారు.
ఇదీ చదవండి
Last Updated : Jun 6, 2021, 4:12 PM IST