ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telugu academy arrest: తెలుగు అకాడమీ కుంభకోణంలో మరో నిందితుడు అరెస్ట్ - మరో నిందితుడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు

తెలుగు అకాడమీ కేసులో మరో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కకుండా షిర్డీలో తలదాచుకుంటున్న మదన్​ను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు అకాడమీకి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Telugu academy arrest
Telugu academy arrest

By

Published : Oct 30, 2021, 6:46 AM IST

తెలుగు అకాడమీ ఫిక్స్​డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో మరో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. షిర్డీలో తలదాచుకున్న మదన్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్​కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

తెలుగు అకాడమీకి చెందిన నిధులను ఫిక్స్​డ్ డిపాజిట్లను రూ.64.05 కోట్లు కాజేసిన సాయికుమార్ బృందంలో మదన్ కూడా ఒక సభ్యుడని పోలీసులు తెలిపారు. సాయికుమార్​కు మూడేళ్ల క్రితం పరిచయమైన మదన్.. తెలుగు అకాడమీలో నిధులను ఫిక్స్​డ్ డిపాజిట్లను కొట్టేద్దామని సాయికుమార్ ప్రతిపాదించినప్పుడు తానూ సహకరిస్తానని.. వాటా ఇవ్వాలంటూ కోరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకూ సాయి కుమార్, వెంకటరమణ, రాజశేఖర్ల సూచనల మేరకు ఫిక్స్​డ్ డిపాజిట్ల నకిలీ రసీదులు, ఇతర పనులు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశామని ఏసీపీ మనోజ్ కుమార్ తెలిపారు. కెనరాబ్యాంక్ మాజీ మేనేజర్ సాధన భర్త బాబ్జీకి 41 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు. విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన యోహాన్ రాజును పీటీ వారెంట్​పై ఇక్కడికి తరలించనున్నామని వివరించారు.


ఇదీ చూడండి:

TELUGU ACADEMY FD SCAM : తెలుగు అకాడమీ కుంభకోణంలో సాయికుమార్​దే కీలకపాత్ర..: సీపీ

ABOUT THE AUTHOR

...view details