ARREST: తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసు.. మరో నిందితుడి అరెస్టు
17:11 October 19
VJA_Telugu acadamy FD scam_Onemore arrest_Breaking
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్ వ్యవహారంలో మరో కీలక నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సాయికుమార్‌తో కలిసి డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో కృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తులో తేలింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణారెడ్డి కూకట్‌పల్లిలోని నిజాంపేటలో నివాసముంటున్నారు. తెలుగు అకాడమీ డిపాజిట్లలో కృష్ణారావు తనవాటాగా రూ.6కోట్లు తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసు విచారణలో మాత్రం కృష్ణారెడ్డి రూ.3.5కోట్లు తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో రూ.9.60కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లో రూ.5కోట్ల గోల్‌మాల్ వ్యవహారంలోనూ కృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో 8మంది నిందితుల పోలీసు కస్టడి ఈరోజుతో ముగిసింది. దీంతో వారిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదీ చదవండి: