ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana Students: ఉక్రెయిన్​ నుంచి భారత్​కు తెలంగాణ విద్యార్థులు - తెలంగాణ వార్తలు

Telangana Students Reached Delhi : ఆపరేషన్‌ గంగలో భాగంగా మరో 23 మంది తెలంగాణ విద్యార్థులు... ఉక్రెయిన్​ నుంచి దిల్లీ చేరుకున్నారు. బుధవారం సాయత్రం వరకు వారి స్వస్థలాకు పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana Students Reached Delhi
Telangana Students Reached Delhi

By

Published : Mar 2, 2022, 2:18 PM IST

Telangana Students Reached Delhi : ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు భారత్ చేరుకుంటున్నారు. మరో 23 మంది తెలంగాణ విద్యార్థులు దిల్లీ చేరుకున్నారు. దిల్లీ తెలంగాణ భవన్‌కు చేరుకున్న విద్యార్థులను బుధవారం సాయంత్రం వరకు స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిరోజులుగా బాంబుల మోతతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్​లో ఉన్న విద్యార్థులు... స్వదేశంలో అడుగుపెట్టగానే ఊపిరి పీల్చుకున్నారు.

వేగంగా తరలింపు

బుకారెస్ట్‌ నుంచి 249 మంది భారతీయులతో భారత్ సోమవారం చేరుకున్నారు. వీరిలో 16 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ఐదుగురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. ఉక్రెయిన్‌ నుంచి దిల్లీకి 25 మంది, ముంబయికి 14 మంది రాగా.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు ముంబయిలో వసతి ఏర్పాట్లు చేశారు. దిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. వారందర్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విమానాల్లో ఉచితంగా శంషాబాద్‌కు తీసుకొచ్చింది. శంషాబాద్‌లో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. తమను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాయబార కార్యాలయ అధికారులకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఇంకా ఉన్న వారినీ సురక్షితంగా తీసుకొస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలను ఆయన ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు అందించారు.

ఇదీ చదవండి:Students Return: యుద్ధభూమి నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details