రాష్ట్రానికి మరో 20 వేల కొవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరాయి. టీకాలను ప్రత్యేక కంటైనర్ ద్వారా గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు.
వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు తుది దశకు చేరాయి. రాష్ట్రస్థాయి నిల్వకేంద్రంనుంచి జిల్లా కేంద్రాలకు చేరిన టీకాలను.. క్షేత్రస్థాయికి తరలిస్తున్నారు. శనివారం నుంచి....దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభంకానండగా... రాష్ట్రంలో తొలిదశలో 4 లక్షల 96 వేల మంది కరోనా పోరాట యోధులకు టీకా వేయనున్నారు.
కడప జిల్లాలో...
కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి బుధవారం 28,500 వ్యాక్సిన్లను కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య తీసుకొచ్చారు. వ్యాక్సిన్లను జిల్లాలో ఎంపిక చేసిన 20 ఆరోగ్య కేంద్రాలకు పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. ఈనెల 16 నుంచి వ్యాక్సిన్లను వేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా హెల్త్ వర్కర్లకు ఈ డోసులు ఇవ్వనున్నారు.