పేదవాడికి అన్నం పెట్టింది అన్న క్యాంటీన్. పేదవాడి నోటి దగ్గర ముద్దను దూరం చేసింది రాజన్న క్యాంటీన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. రివర్స్ టెండరింగ్లో పేదలకు పెట్టే అన్నం కొట్టేశారు జగన్ అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. వైకాపా పాలనలో పేదవాళ్లపై కక్ష కట్టి వేధిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. పేదవాడిపై ఛార్జీల మోత మోగించారని, ఉపాధిని దూరం చేశారని ధ్వజమెత్తారు. ఆఖరికి తినడానికి తిండి కూడా లేకుండా చేశారని లోకేశ్ వాపోయారు.
'పేదవాడికి అన్నం పెట్టింది అన్న క్యాంటీన్' - nara lokesh tweet on rajana canteen
అన్న క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. పేదలపై కక్ష కట్టి వైకాపా ఈ విధంగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పేదవాడికి అన్నం పెట్టింది అన్న క్యాంటిన్'
Last Updated : Feb 24, 2020, 10:14 PM IST