ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఝార్ఖండ్ కొత్త డీజీపీగా ఏపీకి చెందిన వ్యక్తి - mv rao new DGP of Jharkhand

ఝార్ఖండ్ రాష్ట్ర నూతన డీజీపీగా గుంటూరు జిల్లాకు చెందిన ఎంవీ.రావ్ (విష్ణు రావ్ మండవ) నియమితులయ్యారు. ప్రస్తుతం హోంగార్డ్స్, ఫైర్​ సర్వీసెస్ డీజీగా పని చేస్తున్న ఆయన్ను... సోరెన్ ప్రభుత్వం కొత్త డీజీపీగా నియమించింది.

andhrapradesh  person as new DGP of Jharkhand
andhrapradesh person as new DGP of Jharkhand

By

Published : Mar 17, 2020, 5:59 PM IST

Updated : Mar 17, 2020, 8:58 PM IST

ఝార్ఖండ్ కొత్త డీజీపీ ఎం.వి. రావ్

ఝార్ఖండ్ రాష్ట్ర కొత్త డీజీపీగా గుంటూరు జిల్లాకు చెందిన ఎం.వి.రావ్ నియమితులయ్యారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన ఆయన... డీజీపీగా సుమారు 18 నెలల పాటు కొనసాగనున్నారు. అత్యంత నిజాయితీ అధికారిగా పేరున్న ఎం.వి.రావ్ పలు కీలక బాధ్యతలు చేపట్టారు. వరంగల్​లోని రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

ఈటీవీ భారత్​తో ముఖాముఖి..

ఝార్ఖండ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఎం.వి. రావ్ ఈటీవీ భారత్​తో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అదే సమయంలో ప్రజలకు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా పని చేస్తామన్నారు. ఝార్ఖండ్​లో నక్సలిజం అతిపెద్ద సమస్య అని...దానిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'స్థానికం' ఎన్నికల వాయిదాపై తెదేపా - వైకాపా మాటల యుద్ధం

Last Updated : Mar 17, 2020, 8:58 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details