ఆరోగ్యశ్రీ పథకం కింద ఇకపై రాష్ట్రవ్యాప్తంగా 2,434 వ్యాధులకు చికిత్స అందించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాన్ని లాంఛనంగా విస్తరించనున్నారు. ఇప్పటికే 7 జిల్లాల్లో.. 2,434 వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందిస్తున్నారు. నేటి నుంచి మిగిలిన 6 జిల్లాలకు విస్తరిస్తారు. నవంబర్ 10 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2,200 వ్యాధులు, అదనంగా 234చికిత్సలు కలిపి మొత్తం 2,434 వ్యాధులకు చికిత్స అందిస్తామని.. ముఖ్యమంత్రి జగన్ గతంలోనే ప్రకటించారు. పథకం విస్తరణ కార్యక్రమం అనంతరం మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన కొవిడ్ బాధితులతో ముఖ్యమంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
ఆ 6 జిల్లాల్లోనూ ఆరోగ్య శ్రీ విస్తరణ సేవలు..ఇవాళే ముహుర్తం - వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణ తాజా వార్తలు
ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తరించనున్నారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా 2,434 వ్యాధులకు చికిత్స అందించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ పథకాన్ని విస్తరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కొవిడ్ బాధితులతో సీఎం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
CM_WILL_EXTEND_AROGYA
Last Updated : Nov 10, 2020, 4:46 AM IST