ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 3, 2022, 2:31 PM IST

ETV Bharat / city

Pay And Play: శాప్​ నిర్ణయం.. పేద క్రీడాకారుల పాలిట శాపం

pay and play: సాధారణంగా క్రీడాకారులు మైదానంలో ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పే అండ్ ప్లే విధానం వల్ల ఆర్థిక భారాన్ని సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 'శాప్​' తాము నిర్వహించే పోటీల్లో క్రీడాకారుల నుంచి కొంత మొత్తం వసూలు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పేద క్రీడాకారులకు ఇబ్బందిగా మారనుంది.

pay and play
పే అండ్ ప్లే

పేద క్రీడాకారులకు ఇబ్బందిగా మారిన 'శాప్​' నిర్ణయం...

pay and play: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పే అండ్ ప్లే విధానం వల్ల క్రీడాకారులు మైదానంలో ప్రత్యర్థుల్నే కాదు, ఆర్థిక భారాన్ని సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం తెచ్చిన జీవోకు సవరణలు చేస్తు ఒక్కో క్రీడకు ఒక్కో ధర వసూలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ నిర్ణయం మధ్యతరగతి, పేద క్రీడాకారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని....క్రీడారంగ నిపుణులు, క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 'శాప్​' తాము నిర్వహించే పోటీల్లో క్రీడాకారుల నుంచి కొంత మొత్తం వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం పేద క్రీడాకారులకు భారంగా మారుతోంది. జీవో నంబర్ 20 ప్రకారం ఒక్కో ఆటకు ఒక్కో ధరను నిర్ణయించే అధికారం కలెక్టర్‌లకు ఇవ్వడం జరిగింది. శాప్ పరిధిలో నిర్వహించే హాకీ, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్ బాల్, సైక్లింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్‌ వంటి 19 రకాల క్రీడలకు రుసుం వసూలు చేయాలని శాప్ ఆదేశాలు జారీచేసింది.

జనవరిలో తెల్లరేషన్ కార్డు ఉన్న పేద క్రీడాకారులకు రుసుం అవసరం లేదని జీవో ఇచ్చారు. చాలామంది పేద విద్యార్థులకు రేషన్ కార్డులు లేకపోవడంతో డబ్బు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు డబ్బులు చెల్లించనవసరం లేదని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది ప్రైవేట్‌ పాఠశాలల్లోనే చదువుకోవటం వల్ల క్రీడాకారులకు ఎలాంటి ఉపశమనం పొందే అవకాశం లేదు. క్రీడలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు ఇలా క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై క్రీడా నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెరికల్లాంటి పేదక్రీడాకారుల భవిష్యత్తు దెబ్బతింటుందని వాపోతున్నారు

పిల్లల్ని క్రీడలకు దూరం చేసేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాప్ తక్షణం ఈ జీవోపై పునరాలోచించాలని క్రీడాలోకం డిమాండ్ చేస్తోంది.

ఇదీ చదవండి:

సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details