ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మా సంస్థలో 36 లక్షల మంది రైతులే యజమానులు'

అమూల్ రాక ఎవరికీ పోటీకాదని.. ఆ సంస్థ ఎండీ సోధి స్పష్టం చేశారు. రైతులు, వినియోగదారులకు మేలు జరగనుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ త్వరలో రెండో అమూల్‌గా మారుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా పాలసేకరణ మంచి నిర్ణయమని కొనియాడారు.

By

Published : Dec 2, 2020, 4:55 PM IST

Updated : Dec 2, 2020, 5:21 PM IST

'తమ సంస్థలో 36 లక్షల మంది రైతులే యజమానులు'
'తమ సంస్థలో 36 లక్షల మంది రైతులే యజమానులు'

తమ సంస్థలో 36 లక్షల మంది రైతులే యజమానులని అమూల్‌ డెయిరీ ఎండీ సోధి పేర్కొన్నారు. గుజరాత్ కాకుండా 7 లక్షల మంది ఇతర రాష్ట్రాల వాళ్లకు భాగస్వామ్యం ఉందని వివరించారు. దేశంలో రూ.8 లక్షల కోట్ల టర్నోవర్ పాల వ్యాపారం జరుగుతుందన్న సోధి... ఏపీలో ప్రతిరోజు 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి అవుతుందని చెప్పారు. 2.9 కోట్ల లీటర్ల వినియోగం తర్వాత మిగులు ఉత్పత్తి ఉందన్నారు.

ఏపీలో వ్యవస్థీకృతంగా నిత్యం 69 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని అమూల్‌ డెయిరీ ఎండీ సోధి చెప్పారు. ఏపీలో నాణ్యమైన పాల దిగుబడి ఉందని... అమూల్ రాక ఎవరికీ పోటీకాదని స్పష్టం చేశారు. రైతులు, వినియోగదారులకు మేలు జరగనుందని సోధి పేర్కొన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా పాలసేకరణ మంచి నిర్ణయమని కొనియాడారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా సేకరణతో త్వరగా చెల్లింపులకు ఆస్కారం ఉంటుందన్న సోధి... ఆంధ్రప్రదేశ్ త్వరలో రెండో అమూల్‌గా మారుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్

Last Updated : Dec 2, 2020, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details