Kidnap: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలి భర్త శిఖామణి.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయించడం కలకలం సృష్టించింది. 15రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన ఓ కోఆప్షన్ సభ్యురాలి భర్త శిఖామణి.. తన బంధువులకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన సదరు మహిళ భర్త.. రాజు వారి బాగోతాన్ని వీడియోలు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న శిఖామణి తన అనుచరులను పంపించి.. రాజును కిడ్నాప్ చేయించాడు. అతని వద్ద ఉన్న వీడియోలను తీసివేయించి రాజును విడిచిపెట్టారు. ఈ ఘటన 15రోజుల క్రితం జరగగా బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.